తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి తిరుపతికి 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మంగళవారం నుంచి హైదరాబాద్- తిరుపతి, తిరుపతి- హైదరాబాద్, తిరుపతి- కాకినాడ టౌన్, కాకినాడ టౌన్- తిరుపతి మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నారు.