రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజాము నుంచే వైయస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం మొదలైంది. వలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలోని 60.75 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల కోసం ప్రభుత్వం రూ.1543.80 కోట్లను విడుదల చేసింది. వలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఉదయం 07.00 గంటల వరకు 30.01 శాతం పెన్షన్ల పంపిణీ ద్వారా సుమారు 18.22 లక్షల మందికి రూ.461.92 కోట్లు అందజేశారు వలంటీర్లు. అలాగే.. ఉదయం ఎనిమిది గంటల వరకు 48.27 శాతం పెన్షన్ల పంపిణీ, 29.32 లక్షలమందికి రూ.744.02 కోట్ల అందజేసినట్లు, అదే విధంగా ఉదయం 09:00 గంటల వరకు 58.52 శాతం పెన్షన్ల పంపిణీ.. 35.55లక్షల మందికి రూ.902.60 కోట్లు, ఉదయం 10:00 గంటల వరకు 66.15 శాతం పెన్షన్ల పంపిణీ.. 40.18 లక్షల మందికి రూ.1020.68 కోట్లు అందచేసినట్టు డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ముత్యాల నాయుడు తెలిపారు.