రాష్ట్రంలో పెట్టుబడులు ఏమి వచ్చాయో తెలియదు గానీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం సంవత్సరానికో ప్యాలెస్ కడుతున్నారని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఈ మేరకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. సీఎం జగన్ చెన్నైలోని ఈసీఆర్ రోడ్డులో కట్టే ప్యాలెస్ కోసం రాత్రికి రాత్రే ఇసుక, డబ్బు కంటైనర్లలో ఆంధ్రా బోర్డర్ దాటి వెళ్తోందని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.తమిళనాడు రాజధాని చెన్నైలో మరో ప్యాలెస్ కడుతున్నారని వ్యాఖ్యానించారు. అలాగే, టైల్స్ వేస్తున్నారంటగా.. రాజమహేంద్ర వర్మ హ్యాపీ అంట కదా.. అంటూ సెటైర్లు వేశారు.
‘‘చెన్నైలో ఈసీఆర్ రోడ్లో ప్యాలెస్ కడుతున్నారు అంట కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి? ఇసుక డబ్బు అంత కంటైనర్లు కంటైనర్లు రాత్రికి రాత్రి ఆంధ్ర బోర్డర్ దాటి చెన్నై వెళ్ళిపోతుంది అంట కదా.. టైల్స్ ఎస్తునార్ అంటాగా.. రాజమహేంద్ర వర్మ హ్యాపి అంట కదా.. రాష్ట్రంలో పెట్టుబడులు ఏమి వచ్చాయో తెలీదు కానీ..! జగన్ గారు సంవత్సరం కో ప్యాలస్ కడుతున్నారు.’’ అని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.