తన మాజీ భార్య, నటి అంబర్హెర్డ్ పై వేసిన పరువు నష్టం కేసులో హాలీవుడ్ నటుడు జానీడెప్ కు కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. హెర్డ్ అతడికి రూ.116 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. హెర్డ్ ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పింది. అలాగే డెప్ కూడా పరిహారం కింద హెర్డ్ కు రూ.15.5కోట్లు (2 మి.డాలర్లు) చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు డెప్ కి అనుకూలంగా తీర్పునివ్వడంతో హెర్డ్ కన్నీళ్లు పెట్టుకుంది.