గ్రామాల్లో నాటు సారా కాస్తే జైలు తప్పదని వై. పాలెం సీఐ మారుతీకృష్ణ హెచ్చరించారు. సారా తయారీతో కలిగే అనర్థాలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు గ్రామంలో ప్రతి ఇంటినీ తనిఖీ చేశారు. నాటు సారా తయారీపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని, అలాంటి వ్యక్తులు పట్టుబడితే జైలుకు వెళ్తారని, లక్ష రూపాయలు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.