అధిక బరువు సమస్య చాలా మందిని వేధిస్తోంది. బరువు తగ్గేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. డైట్ లో మార్పు చేయడం, వ్యాయామం చేయడం వంటివి చేస్తుంటారు. మరి కొంత మంది రకరకాల మెడిసిన్లను ఉపయోగిస్తుండటం చూస్తున్నాం. అయితే అధిక బరువుకు చెక్ పెట్టాలంటే సులభమైన, సహజమైన మార్గాలు అవలంభించడం మేలు. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు బరువు పెరగడానికి కారణం అవుతున్నాయి. అయితే ప్రకృతి ప్రసాధించిన పండ్లను తీసుకోవడం ద్వారా అధిక బరువును సమస్య నుంచి బయటపడొచ్చని అంటున్నారు నిపుణులు. ఇప్పుడు చెప్పబోయే ఫైవ్ ప్రూట్స్ తీసుకోవడం వల్ల బరువు సమస్యకు చెక్ పెట్టొచ్చు.
ద్రాక్షపండు: ద్రాక్షపండ్లు బరువు తగ్గించడంలో మేలు చేస్తాయని అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. ద్రాక్షపండులో 65 కేలరీలు మాత్రమే ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా దీంతో బరువులో 7.1% తగ్గుతారు.
అరటి: అరటిలో 112 కేలరీలు మాత్రమే ఉన్నాయి. ఇవి మీ బరువును అదుపులో ఉంచుతాయి. ఈ రుచికరమైన పండులో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. దీని వల్ల ఇది కడుపు నిండిన భావనను ఎక్కువ సేపు ఉంచుతుంది. అందువల్ల అధికంగా ఆహారం తీసుకునే అలవాటు తప్పుతుంది.
యాపిల్: యాపిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి రోజూ ఓ యాపిల్ తీసుకుంటే డాక్టరు వద్దకు వెళ్లే అవసరమే ఉండదు అని చెబుతుంటారు. అంతలా ఉపయోగాలు ఉంటాయి ఈ యాపిల్ వల్ల. ఒక ఆపిల్‌లో కేవలం 100 కేలరీలు, దాదాపు 5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. యాపిల్స్ ను తీసుకోవడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గిపోతుంది.
పాషన్ ఫ్రూట్: ఇది దక్షిణ అమెరికాకు చెందిన పండు. ఈ పండులో విటమిన్ ఎ, సి సమృద్ధిగా ఉన్నాయి. ఇందులో కేవలం 18 కేలరీలు మాత్రమే ఉంటాయి. బీపీ కంట్రోల్ లో ఉంచడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడానికి, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
నారింజ: నారింజలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. తియ్యగా పుల్లగా ఉంటే నారింజ పండును అందరూ ఇష్టపడుతుంటారు. ఈ సిట్రస్ పండ్లలో 72 కేలరీలు, దాదాపు 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం కరిగే ఫైబర్ శరీరం ఉత్పత్తి చేసే ఆకలి హార్మోన్ల స్థాయిలను అణిచివేసేందుకు నారింజ పండ్లు సహాయపడుతాయని తేలింది.