గుంటూరుజిల్లాలో అక్రమమైనింగ్ తవ్వకాలు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆందోళనకు దిగారు. గుంటూరు మైనింగ్ డీడీ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు హోరెత్తించారు. మైనింగ్ తవ్వకాలను నిలుపుదలచేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకిచెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, మైనింగ్ మాఫియాతో కుమ్మక్కై సహజవనరులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.కోట్లాది రూపాయలను అక్రమంగా ఆర్జిస్తున్నారని మండిపడ్డారు. మైనింగ్ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్‌చేస్తూ డిప్యూటీ డైరెక్టర్‌కు వినతిపత్రం అందించారు. మైనింగ్ తవ్వకాలనై శాఖాపరంగా విచారించి చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ చర్యలకోసం కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తామని మైనింగ్ అధికారులు తెలిపారు