ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజొన్న, రాగులు, ఇతర ధాన్య పంటలను కల్లాల్లో. రోడ్లపై ఆరవేస్తున్నారు. వానాకాలం రుతుపవనాల రాకతో ఏ సమయంలోనైనా వర్షం వచ్చే అవకాశం ఉంది. దీంతో పంటలను ఆరబోసుకున్న రైతులు ఆందోళనలో ఉన్నారు. గతంలో పంటలను వర్షాల నుంచి కాపాడు కోవడానికి ప్రభుత్వం టార్పాలిన పట్టలను రాయితీ పై సరఫరా చేసింది. మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించింది. అందులో భాగంగా టార్పాలిన పట్టలు పంపిణీ ప్రక్రియ అటకెక్కింది. టార్పాలిన పట్టలు కోసం తాము పలుమార్లు వ్యవసాయ కార్యాలయాల్లో అధికారులను విజ్ఞప్తి చేసుకున్నా. పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. దీనిపై ఉదయగిరి మండల వ్యవసాయ అధికారి చెన్నారెడ్డి ని వివరణ కోరగా టార్పాలిన పట్టలు కావాలని రైతులు కోరుతున్నారు. అయితే వాటిని ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం. మంజూరైతే పంపిణీ చేస్తామని చెప్పారు.