మెదడు చురుగ్గా ఉండాలంటే తగిన పోషకాలున్న ఆహారం తినాలి. మెదడు నిర్మాణంలో కీలకమైన ఫోలిక్ యాసిడ్, ఐరన్ వంటివి పాలకూర, ఇతర ఆకుకూరలు, పప్పుధాన్యాల్లో లభిస్తాయి. మాంసం, డ్రైఫ్రూట్స్‌లో రక్తం ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే ఐరన్ పుష్కలంగా ఉంటుంది. డార్క్ చాక్లెట్లు, గుడ్లు, చిరుధాన్యాలు, నట్స్‌లో జ్ఞాపక శక్తిని పెంచే జింక్ దొరుకుతుంది. మెదడుకు రక్తప్రసరణ మెరుగు పరిచే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చేపలు, వాల్‌నట్స్, గుమ్మడి, అవిసె గింజల్లో ఉంటుంది.