గుమ్మడికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.దీని వల్ల తెల్లరక్తకణాలు వృద్ధి చెందుతాయి మరియు రోగనిరోధక కణాలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. గాయాలు త్వరగా తగ్గుతాయి. యాంటీఆక్సిడెంట్లు కడుపు, గొంతు, ప్యాంక్రియాటిక్ మరియు రొమ్ము క్యాన్సర్లను నివారిస్తాయి. గుమ్మడికాయ గింజలు శృంగారంలో పాల్గొనడానికి సహాయపడతాయి. గుమ్మడికాయలోని జింక్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందువల్ల జలుబు, దగ్గు, చర్మ సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
గుమ్మడికాయలో కెరోటినాయిడ్స్, ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ ఇ, జింక్, ఐరన్, కాల్షియం, కాపర్, ఫాస్పరస్ మరియు అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. గుమ్మడికాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే కొంచెం తిన్నాక కడుపు నిండుగా, ఆకలిగా అనిపించదు. దీని కారణంగా, మీరు బరువు కోల్పోతారు. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల గుండె సమస్యలు, బ్లడ్ షుగర్, క్రానిక్, కంటి సమస్యలు మరియు క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు.