ఆశా వర్కర్లకు రూ. 15 వేలకు వేతనం పెంచి, పని భారం తగ్గించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏసు రత్నం, జిల్లా కార్యదర్శి రణధీర్, పట్టణ కార్యదర్శి రామ్ నాయక్, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు భారతి, సులోచన, శాంతి, సంతోషమ్మ లు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్ నందు ఆశావర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని వైద్య అధికారులకు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ని ఆశలు గా మార్పు చేయాలన్నారు. ఆశలకు సంబంధం లేని పనులు చేయించరాదు, పని భారాన్ని తగ్గించాలని అన్నారు. కాకూరు సోమలమ్మ మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవ్, వేతనంతో కూడిన మెటర్నటీ లీవ్ అమలు చేయాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. 5 లక్షల ఇవ్వాలన్నారు. 62 సంవత్సరాల రిటైర్మెంట్ జీవో ని వర్తింప చేయాలన్నారు. నాణ్యమైన సెల్ ఫోన్స్, 4జి సిమ్ ఇవ్వాలన్నారు. ఎఎన్ఎం, హెల్త్ సెక్రటరీల నియామకాలలో ఆశాలకు వెయిటేజీని ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్లు లక్ష్మీబాయి, రవణమ్మ, సామ్మక్క, లక్ష్మీదేవి, జానకి, లింగమ్మ, అపర్ణ, వరలక్ష్మి, జయలక్ష్మి, కుమారి, శారద, జ్యోతి, హేమలత, భాగ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.