రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి పత్తికొండ నియోజకవర్గంలో విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం నియోజకవర్గంలోని పులికొండ గ్రామపంచాయతీ (సచివాలయం) కొత్తపల్లి గ్రామంలో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమం జరిగింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినవన్నీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో దాదాపు అన్ని హామీలను నెరవేర్చామని అందుకే దైర్యంగా గడప గడపకు వెళుతున్నామని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు, కార్యకర్తలతో కలిసి ఆమె ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. స్థానిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలను వెంటనే పరిష్కారం అయ్యే విధంగా చూడాలని నేతలు అధికారులను ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి పథకాల గురించి వివరించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ...ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును తెలుసుకు నేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.ముఖ్యమంత్రి వైయస్ జగ న్ పాలనలో ప్రతి ఇంటి ముంగిటకు సంక్షేమ పథకాలు చేరుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వైయస్ జగన్ సీఎం అయి మూడేళ్లు పూర్తి అయిన తరువాత ప్రజల్లో ఆయనపై మరింత నమ్మకం పెరిగిందన్నారు. గడప గడప వెళ్ళినప్పుడు ప్రజలు ఇదే విషయాన్ని మాకు చెబుతున్నారని చెప్పారు.తాను అధికారంలోకి వచ్చాకా ఏమి చేయగలడో ఈ మూడేళ్ళలో స్పష్టంగా చేసి చూపించాడని చెప్పారు. వైయస్ జగన్ పాలనలో కులాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ఇది ఇలా ఉంటే వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రజల్లో వస్తున్న ఆదరాభిమానాలు చూసి ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ, జనసేన, ఎల్లో మీడియా నిత్యం దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. గడప గడప లో ఒకటో రెండో సమస్యలు వస్తే వాటినే భూతద్దంలో పెట్టి చూపుతున్నాయన్నారు.వీళ్ళు ఎన్ని అసత్యాలు ప్రచారం..ప్రసారం చేసిన ప్రజలకు వాస్తవాలు తెలుసని ఇవేవీ పట్టించుకోరని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, ఎంపిపి నారాయణ దాస్, వైస్ ఎంపిపి కొత్తపల్లి బలరాముడు, పులికొండ తిప్పయ్య, నరసింహులు, కొత్తపల్లె గ్రామ నాయకులు, మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.