శరీర ఆరోగ్యానికి బ్రేక్ ఫాస్ట్ ముఖ్యం. కానీ అనేక మంది బ్రేక్ ఫాస్ట్ గా ఏది పడితే అది తీసుకుంటుంటారు. కానీ ఈ క్రింది పదార్థాలను అల్పఆహారంగా తీసుకోకపోవడమే బెటర్ అంటున్నారు.
*పిండి, చక్కెర అధికంగా ఉండే కేకులను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోకండి.
*ఉదయం అల్పాహారం కోసం ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోకండి. ప్రాసెస్ చేసిన లేదా ప్యాక్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల మీ శరీరంలో కొవ్వు పెరుగుతుంది.
*నూడుల్స్ తినడానికి చాలా రుచికరరంగా ఉన్నప్పటికీ అల్పాహారంగా దీనిని అస్సలు తినొద్దు.
*నూనెలో వేయించిన వాటిని తినకుండా ఉండటమే బెటర్. పూరి, పరోటా లాంటి పదార్థాల బదులుగా ఉదయాన్నే బ్రెడ్, వోట్స్, పండ్లు తీసుకోవడం మంచిది.