భూ తగాదా ఒకరి ప్రాణం తీసింది. ఈ ఘటన కాసిపేట మండలంలోని గురువాపూర్ గ్రామంలో జరిగింది. ఎస్ఐ గంగారం తెలిపిన వివరాల ప్రకారం గెడాం సాగర్ (28), తెడాం సుంగకు గ్రామంలో తల్లిదండ్రుల ఆస్తి మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఈ భూమి విషయమై తరచుగా ఇద్దరు గొడవ పడుతున్నారు. ఆదివారం అదే గ్రామంలో తమ బంధువుల వివాహానికి ఇరువురు హాజరయ్యారు. అక్కడే ఇద్దరు గొడవ పడ్డారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన అన్న సుంగు తిరిగి గొడ్డలితో వచ్చి సాగర్ పై గొడ్డలితో దాడి చేయగా తీవ్ర రక్తస్రావమై సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, పాప ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.