విద్యావ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రభుత్వపాఠశాలలో చదివి పదో తరగతి పరీక్షల్లో 590మార్కులు తెచ్చుకున్న జయశ్రీ అనే విద్యార్థిని తెలియజేసింది. ప్రైవేటు పాఠశాలల తరహాలో ప్రభుత్వం అందించిన సదుపాయాలు తన చదువుకు ఎంతో దోహద పడ్డాయంటున్న విద్యార్థిని. అలాగే తమది చేనేత కుటుంబమని, నేతన్న నేస్తం పథకం ద్వారా సీఎం వైయస్ జగన్ తమని ఆదుకున్నారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ఎంతగానో బాగుపడ్డాయి అని తెలియజేసారు. అలానే సిబ్బంది కొరత ఉన్న పాఠశాలల్లో ఆ సమస్యను అరికడితే రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు ఎన్నో మంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపుతుంది అని తెలియజేసారు.