ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లపై(ఎఫ్డీ) వడ్డీని 0.20 శాతం పెంచింది. జూన్ 14 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఈ పెంపుతో 211 రోజుల నుంచి ఏడాది వ్యవధి డిపాజిట్లపై వడ్డీ 4.60 శాతానికి పెరిగింది. 1-2 ఏళ్ల డిపాజిట్లపై వడ్డీ 5.30 %, 2-3 ఏళ్ల డిపాజిట్లపై 5.35% వడ్డీ లభించనుంది. సీనియర్ సిటిజన్లకు దీనిపై 0.5% అదనంగా వడ్డీ లభిస్తుంది. రూ.2 కోట్లపైబడిన డిపాజిట్లపై వడ్డీని ఎస్బీఐ 0.75 % పెంచింది.