ఏపీలోని విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం ముచ్చర్లవలసలో దారుణం జరిగింది. గ్రామంలో రమణమ్మ(34) అనే మహిళకు రమణ అనే వ్యక్తితో ఎఫైర్ నడుస్తోంది. జూన్ 10న మరో వ్యక్తి అర్ధరాత్రి ఆమె ఇంటి నుంచి పోవడం రమణ చూశాడు. ఆగ్రహంతో రమణమ్మ గట్టిగా కొట్టాడు. తలకు గాయం కావడంతో 11న ఆమె మరణించింది. విచారణలో రమణ హంతకుడని తేలడంతో పోలీసులు అతడిని మంగళవారం అరెస్టు చేశారు.