దూర ప్రయాణాలకు అనువైన బైక్ ఇపుడు మార్కెట్ లోకి వచ్చేసింది. బ్రిటీష్ బైకు తయారీదారి నార్టన్ మోటార్ సైకిల్స్ ఇటీవలే తన కొత్త స్పోర్ట్స్ బైకును లాంచ్ చేసింది. దీని పేరు వీ4ఎస్‌వీ. ఈ స్పోర్ట్స్ బైకును కంపెనీ 44 వేల బ్రిటీష్ పౌండ్లకు లాంచ్ చేసింది. దీని ధర భారతీయ కరెన్సీలో రూ.41.47 లక్షలు. ఫార్చ్యూనర్ చాలా మోడల్స్ కంటే కూడా ఈ బైకు ధరనే ఎక్కువ. ఫార్చ్యూనర్ దేశంలోనే అత్యంత పాపులర్ ఎస్‌యూవీలలో ఒకటి.
ఈ బైకు స్పెషాలిటీ ఏమిటంటే.. పూర్తిగా కార్బన్ ఫైబర్‌తోనే రూపొందించింది. 15 లీటర్ల కెపాసిటీ కలిగిన కార్బన్ ఫైబర్ ఫ్యూయల్ ట్యాంకు ఈ బైకులో ఉంది. సీటు కింద ఈ ట్యాంకును ఇచ్చింది కంపెనీ. దూర ప్రయాణాలకు ఈ బైకు అనువు. కెవ్లార్ రీఇన్‌ఫోర్స్‌మెంట్‌ను ఈ బైకు ఫ్యూయల్ ట్యాంకులో వాడారు. కార్బన్, మాంక్స్ సిల్వర్ రంగులలో ఈ బైకు లాంచ్ అయింది. కార్బన్ ఫైబర్ బాడీ వర్క్‌తో ఈ బైకు మార్కెట్లోకి వచ్చింది.
ఈ బైకును కంపెనీ ఇన్-హౌస్‌లోనే డిజైన్ చేసి, ఉత్పత్తి చేపట్టింది. పలు ప్రత్యేక ఫీచర్లతో ఈ బైకు మార్కెట్లోకి వచ్చింది. ఫుల్ ఎల్‌ఈడీ లైటింగ్, ఆరు అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ఆటో బ్రైట్‌నెస్ అడ్జెస్ట్‌మెంట్, రియర్ వ్యూ కెమెరా వంటి ఫీచర్లు ఈ బైకులో ఉన్నాయి. ఎస్‌యూవీకి సమానమైన ఇంజిన్ ఈ బైకులో ఉంది. 1200 సీసీ లిక్విడ్ కూల్డ్ 72 డిగ్రీల వీ4 ఇంజిన్‌ను దీనిలో వాడింది. ఈ ఇంజిన్ 12,500 ఆర్‌పీఎం వద్ద 185 బీహెచ్‌పీని, 9000 ఆర్‌పీఎం వద్ద 125 ఎన్‌ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ బ్రాండెడ్ బైకు టాప్ స్పీడ్‌ను కంపెనీ వెల్లడించింది.
అధునాతన టెక్నాలజీతో ఈ బైకును కంపెనీ రూపొందించింది. 6 యాక్సిస్ ఇంటీరియల్ మెజర్మెంట్ యూనిట్, ఏబీఎస్, ఎలక్ట్రిక్ స్టీరింగ్ లాక్‌తో కీలెస్ ఇగ్నిషన్ సిస్టమ్ ఈ బైకులో ఉన్నాయి. పలు ఇంజిన్ విధానాల్లో ఈ మోటార్ సైకిల్ మార్కెట్లోకి వచ్చింది.