రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన దీర్ఘకాలిక చర్యలపై యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని జిల్లా రోడ్డు భద్రతా కమిటీ అధికారులను జిల్లా కలెక్టరు, కమిటీ చైర్మన్ పి. రంజిత్ బాషా ఆదేశించారు.జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, రోడ్ల పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ సమీక్షిస్తూ, ట్రాన్స్పోర్టు, రెవిన్యూ, పోలీసు, ఏపీఎస్ ఆర్టీసీ , రోడ్లు భవనాల శాఖ, నేషనల్ హైవే అధారిటీ, మునిసిపల్ కమీషనర్, డి ఎం హెచ్ ఓ అధికారులు సంయుక్తంగా పూర్తి సమన్వయంతో సమస్యాత్మక రోడ్లను, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను, అందుకు తగిన కారణాలను విశ్లేషించాలని సూచించారు, స్పీడ్ లిమిట్ నోటిఫై చేసి బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వెంటనే యాక్షన్ ప్లాన్ రూపొందించాలని జిల్లా రవాణ శాఖ అధికారిని ఆదేశించారు. అలాగే, రోడ్లపై ప్రమాదాలు జరిగినప్పుడు అంబులెన్సులను, మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే అంబులెన్స్లో ప్రమాదం జరిగిన వ్యక్తిని తీసుకొని దగ్గర్లో ఉన్న హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందేలా చూడాలని అన్నారు. ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డాటాబేస్ లో ప్రమాదాలు జరిగిన వివరాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రెవేట్, పాఠశాలల వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నారా లేదా పరిశీలించి, లేని చోట స్పీడ్ బ్రేకర్స్, స్కూల్ జోన్ సైన్ బోర్డులను ఏర్పాటుచేసి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆర్ అండ్ బి , పంచాయితీరాజ్ రోడ్లలో, ముఖ్యంగా టి జంక్షన్ల వద్ద, స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్ వద్ద మార్కింగ్ పకడ్బదీగా నిర్వహించాలని హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు లేని చోట ఏర్పాటు చేయాలని, కల్వర్టు, బిర్జిల వద్ద వైట్ కలర్ ప్రింటింగ్, రేడియం స్టిక్కర్స్ ఏర్పాటు చేయాలని, జీబ్రా లైన్స్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ ఇంజనీర్లను ఆదేశించారు. ప్రమాదాల నివారణలో భాగంగా హైవే రోడ్లు, సింగిల్ రోడ్లలో ఓవర్ లోడింగ్ వాహనాలు, ఆటోలు, జీప్ లపై కఠినమైన నిఘా ఏర్పాటు చేయాలని, టూ పేలర్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా, వాహనదారులు సీట్ బెల్ట్ తప్పనిసరి ధరించేలా కఠినమైన నిఘా ఏర్పాటు చేయాలని పోలీసు, ట్రాన్స్పోర్టు అధికారులకు సూచించారు. జాతీయ రహదారులపై నిరంతర లైటింగ్ వ్యవస్థ, పిసి కెమెరాల నిఘా తప్పనిసరి వుండాలని కలెక్టర్ ఆదేశించారు. నేషనల్ హైవే వెంబడి కల్వర్టులు, బిడ్జిలు, అండర్పెస్ల వద్ద లైటింగ్ వ్యవస్థ తప్పనిసరిగా వుండేలా చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ప్రాజేక్టు డైరెక్టరుకు సూచించారు.
నేషనల్ హైవేస్ పై వాహనాలు అధిక స్పీడ్ తో వెళ్లి ప్రమాదాలు జరగకుండా స్పీడ్ లిమిట్ అమలు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రోడ్ భద్రత కమిటీలో ఉన్న శాఖలు సమన్వయంతో పనిచేసి కృష్ణాజిల్లాలో ప్రమాదాలు జరగకుండా చూడాలని కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు..