కర్నాటకలో శనివారం విడుదలైన పీయూసీ (ఇంటర్) ద్వితీయ సంవత్సర ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో ఫెయిల్ అయ్యామనే బాధతో ప్రణమ్ ఈశ్వరనాయక్ (18), పవిత్ర లింగదాళ (18), ఎంజే స్పందన (17) ఆత్మహత్య చేసుకున్నారు. ఇదిలా ఉండగా 77 శాతం మార్కులొచ్చినా 90 శాతం మార్కులు రాలేదనే బాధతో కొడగు జిల్లాలో సంధ్య (17) అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని, పరీక్షల్లో ఫెయిల్ అయిన ఎందరో తమ కృషితో ఉన్నత స్థానాలకు చేరుకున్నారని సైకాలజిస్టులు చెబుతున్నారు.