కాకినాడ జిల్లా, బెండపూడి గ్రామం, తొండంగి మండలానికి చెందిన శ్రీమతి తోలెం దుర్గ వారి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తన కుమార్తె తొల్లెం మేఘనా 10 వ తరగతి చదువుతున్నదని, తమ అమ్మాయి ఎంతో కష్టపడి వాళ్ళ మాస్టారు గారి సహకారంతో అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడం నేర్చుకుందని, ఈ విషయమై గౌరనీయులైన ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు వారి అమ్మాయి మరియు తనతో పాటు ఇంగ్లీష్ నేర్చుకున్న పలువురు విద్యార్ధిని విద్యార్థులు CM గారితో అమెరికన్ ఇంగ్లీష్ లో మా అమ్మాయి మాట్లాడిన వీడియోలను వక్రీకరించి "లప లప బాబా " అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్రోల్లింగ్ చేస్తున్నారని, అసభ్యకరమైన పదజాలంతో, తమ అమ్మాయి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ట్విట్టర్ అకౌంట్ లో చేసిన పోస్టింగ్ చాలా బాధ కలిగించాయని, ఇటువంటి ప్రచారాల ద్వారా తన కుమార్తె భవిష్యత్తు పై చెడు ప్రభావం కలుగుతుందని, కావున సదరు ట్విట్టర్ అకౌంట్ & ఆ అకౌంట్ నిర్వాహకులు పై తగు చర్యలు తీసుకోవలసిందిగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయమై ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ రోజు తోందండి PS లో "లప లప బాబా " ట్విట్టర్ అకౌంట్ నిర్వాహకునిపై CrNo.135/2022 Sec 509 IPC & Sec 67 of IT Act 2020 కేసు నమోదు చేశామని ట్విట్టర్ ఖాతా నిర్వాహకుడిని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa