ఎపుడు వస్తుందో...ఎవరి పై దాడిచేస్తోందోనని బిక్కు...బిక్కు మంటూ వణికిన జనం కాస్త ఊపిరి పీల్చుకొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆపరేషన్ ఎలుగుబంటి సక్సెస్ అయ్యింది. కొద్దిరోజులుగా ఎలుగుబంటి వజ్రపుకొత్తూరు సమీపంలోని జీడి, కొబ్బరి తోటల్లో పని చేస్తున్న 8 మంది రైతులపై దాడి చేసింది. భయంతోనే పొలం పనులకు గుంపులుగా వెళ్లిన గ్రామస్తులపై ఒక్కసారిగా పొదల నుంచి వచ్చి దాడి చేసింది. వీరిలో ఒకరు చనిపోగా.. మిగిలిన వారు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. క్షతగాత్రులను శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎలుగును పట్టుకోవాలని స్థానికులు కోరవడంతో అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగి చివరికి పట్టుకున్నారు. మరోవైపు ఎలుగుబంటి దాడి విషయం తెలుసుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు ఆరా తీశారు. క్షతగాత్రులకు కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇదిలావుంటేవజ్రపుకొత్తూరులో కొద్దిరోజులుగా జనాలపై దాడి చేస్తున్న భల్లూకాన్ని ఎట్టకేలకు ఫారెస్ట్ సిబ్బంది పట్టుకున్నారు. కిడిసింగిలోని ఓ ఇంట్లో దూరగా.. ఫారెస్ట్ సిబ్బంది, పోలీసులు చుట్టుముట్టారు. మంగళవారం ఉదయం మత్తు మందు ఇచ్చి చాకచక్యంగా పట్టుకుని బోనులో బంధించి తీసుకెళ్లారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.