కావలసిన పదార్ధాలు: కరివేపాకు - గుప్పెడు, తులసి ఆకులు - గుప్పెడు, పెరుగు - 2స్పూన్లు, కొబ్బరి నూనె - 1 స్పూన్.
తయారీవిధానం: ముందుగా కరివేపాకును, తులసి ఆకులను నీటితో శుభ్రంగా కడగాలి. వీటికి పెరుగును జోడించి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొబ్బరినూనె వేసి బాగా కలపాలి.
అప్లై చేసుకునే విధానం: తయారుచేసి పెట్టుకున్న కరివేపాకు - తులసి హెయిర్ ప్యాక్ ను మాడుకు బాగా పట్టించి, ఒక గంటపాటు ఆరనివ్వాలి. ఆపై తక్కువ గాఢత ఉండే షాంపూతో తలస్నానం చెయ్యాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఉత్తమ ఫలితాలుంటాయి.
ఉపయోగాలు: ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల మాడు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటుంది. దురద, చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. ఈ ప్యాక్ లో అమైనో యాసిడ్స్, పలురకాల మినరల్స్, న్యూట్రియెంట్స్ ఉండడం వల్ల తలకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టు మూలాలను బలపరిచి రాలడాన్ని నిరోధించడంలో ఈ హెయిర్ ప్యాక్ బాగా పనిచేస్తుంది.