మహారాష్ట్ర లు శివసేన కార్యకర్తలు రోడ్డెక్కారు .ఆందోళన తీవ్రతరం చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సీఆర్పీఎఫ్ ‘వై ప్లస్’ సాయుధ భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఎమ్మెల్యేలతోపాటు మహారాష్ట్రలోని వారి కుటుంబాలకు కూడా భద్రత కల్పించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. వై ప్లస్ కేటగిరీ కింద మొత్తంగా 39 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తారు. మూడు షిఫ్టుల్లో ఎప్పుడూ ఇద్దరి నుంచి నలుగురు సాయుధ కమెండోలు, 11 మంది పోలీసు సిబ్బంది కాపలా కాస్తుంటారు. రెండు, మూడు భద్రతా వాహనాలతో ముందూ వెనకా కాన్వాయ్ ఉంటుంది.