ఆల్ట్ న్యూస్ కోఫౌండర్, జర్నలిస్టు మహమ్మద్ జుబైర్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టారని కొందరి మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలతో.. సోమవారం జుబైర్ను అదుపులోకి తీసుకుని ఐపీసీ సెక్షన్ 153ఏ, 295ఏ కేసులు నమోదు చేశారు.
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిథి నూపుర్ శర్మకు సంబంధించిన వీడియోను షేర్ చేయటంతో జుబైర్ వార్తల్లోకి వచ్చారు.