రాష్ట్రంలో ప్రతి గడపకు త్రాగునీరు అందించే బృహత్కర కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. సరుబుజ్జిలి మండలం రొట్టవలస పంచాయతీ పరిధిలోని అవతారాబాదు గ్రామంలో సుమారు 20. 30 లక్షల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కొళాయి కార్యక్రమానికి బుధవారం స్పీకర్ తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. ఆ గ్రామంలో డ్రైనేజీ లేదని మరుగునీరు ఇళ్ల ముందు నిల్వ ఉండిపోతుందని తద్వారా రోగాలు వస్తున్నాయని గ్రామస్తులు స్పీకర్ తమ్మినేని ఫిర్యాదు చేశారు.
అధికారులును పిలిచి మరుగు కాలువలకు ప్రతిపాదన సిద్ధం చేయమని ఆదేశించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ మన నియోజకవర్గంలో ఇంటింటికి మంచినీటి కార్యక్రమం పనులు ఊపందుకున్నాయని త్వరలో ప్రతి గడపకు త్రాగునీరు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కె వి జి సత్యనారాయణ, జడ్పీటీసీలు సురవరపు నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీలు శివానందమూర్తి, లావెటి అనిల్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, పి ఎ సి ఎస్ అధ్యక్షులు కోవిలాపు చంద్ర శేఖర్, స్థానిక సర్పంచ్ ముడడ్ల రమణ, స్థానిక నాయకులు హరీష్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.