వర్షాకాలం, చలికాలంలో గాలిలో తేమ కారణంగా మన చర్మం పొడిబారిపోతుంటుంది. ముఖ్యంగా ముఖం పొడిబారిపోయి, అక్కడక్కడా తెల్ల తెల్లగా కనిపిస్తుంటుంది. దీంతో బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు మనింట్లో దొరికే పెరుగుతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
చర్మం పొడిబారకుండా చేయడంలో పెరుగు సహాయపడుతుంది. పెరుగును వాడడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. పెరుగును ఉపయోగించి చర్మంపై ఉండే మృతకణాలను తొలగించవచ్చు. రెండు స్పూన్ల పెరుగులో ఒక స్పూన్ శనగ పిండి, చిటికెడు పసుపు, అందుబాటులో ఉంటే కొద్దిగా తేనే లేకపోతే నిమ్మరసం వేసి మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ఫేస్ ప్యాక్ లా వేసుకుని 20 నిమిషాల తరవాత చల్లని నీటితో కడగాలి.