మహారాష్ట్ర సీఎం గా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర గవర్నర్ ను కలవనున్నారు. 49 ఎమ్మెల్యేల సంతకాల లెటర్ తో వెళ్లి వారు గవర్నర్ తో భేటీ కానున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ బలపరీక్ష ఎదుర్కోవాల్సి ఉండగా బుధవారం సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.