రొంపిచర్ల మండలం సంతగుడిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రోడ్డుపై లారీ ఆపి టీ త్రాగుతున్న ముగ్గురు వ్యక్తులని లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో లారీ క్లినర్ బిల్లా, టీ కొట్టు ఓనర్ రాజశేఖర్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా డ్రైవర్ రాజేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారిని నరసరావుపేట ప్రభత్వ ఆసుపత్రికి తరలించారు. రొంపిచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa