సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై కేంద్రం విధించిన నిషేధం జూలై 1 నుంచి అమలు కానుంది. అలాగే, శుక్రవారం నుంచే పూరీ జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ రెండింటి నేపథ్యంలో సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ తీరంలో కళాఖండాన్ని తీర్చిదిద్దారు. 'సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేద్దాం' అని సందేశం ఇచ్చేలా ఇసుకతో పూరీ రథయాత్ర కళాఖండాన్ని రూపొందించారు. ఈ సైకిత శిల్పం పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa