ఏవైనా నాన్‌వెజ్ కాంబినేషన్‌తో చింత చిగురును కలిపి వండితే ఆ టేస్టే వేరు. రుచితో పాటు ఇందులో ఎన్నో పోషకాలున్నాయి. ప్రొటీన్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, విటమిన్-సి ఉంటాయి. కాలేయాన్ని సంరక్షించడంలోనూ, జీర్ణక్రియను మెరుగుపర్చడంలోనూ, రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఉపయోగపడుతుంది. చింత చెట్లు తగ్గిపోవడంతో దాని చిగురు సేకరణ కష్టతరమవుతోంది. మార్కెట్‌లో ప్రస్తుతం కిలో రూ.500లు పలుకుతోంది.