జగన్ రెడ్డి ప్రభుత్వం గత ఏప్రిల్ లోనే బస్సు ఛార్జీలు పెంచింది. మూడు నెలలు తిరక్కుండానే మళ్ళీ ఇప్పుడు చార్జీలు పెంచింది అని టీడీపీ నాయకులూ ఆరోపిస్తున్నారు. పెరిగిన బస్సు చార్జీల మీద స్పందించిన కొంతమంది టీడీపీ నాయకులూ మాట్లాడుతూ... ఈ అడ్డగోలు బాదుడును నిరసించాలన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఈరోజు ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండ్ లో పార్టీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేసారు. అంతేకాకుండా జగన్ రెడ్డి బాదుడే బాదుడు గురించి బస్సుల్లో ప్రయాణికులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి V.S.ముక్తియార్, ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు EV సుధాకర్ రెడ్డి, ప్రొద్దుటూరు మండల కన్వీనర్ బాబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.