ఎవరైనా కానీ అధికార దాహంతో ప్రజా విశ్వాసాన్ని వమ్ము చేస్తే.. కచ్చితంగా వారి అహంకారం కూడా విచ్ఛిన్నమవుతుంది’’ అని ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ సర్కారు కూలిపోవడంతో ఆమె పై విధంగా స్పందించింది. తన స్పందనతో కూడిన వీడియోను ఆమె ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. (వీడియో కోసం) ‘‘హనుమంతుడిని పరమశివుడి 12వ అవతారంగా చెబుతారు. శివసేన హనుమాన్ చాలీసాను నిషేధించినప్పుడు, శివుడు కూడా వారిని కాపాడలేడు. హర హర మహాదేవ్, జై హింద్, జై మహారాష్ట్ర. చెడు ఆక్రమించినప్పుడు వినాశనం తప్పదు. ఆ తర్వాత మళ్లీ సృష్టి జరుగుతుంది. జీవన కమలం వికసిస్తుంది’’ అంటూ ఆమె తన అభిప్రాయాలను వెల్లడించింది.
‘‘ప్రజాస్వామ్యం అనేది నమ్మకానికి సంబంధించినదిగా 2020లో నేను చెప్పాను. ఎవరైనా కానీ అధికార దాహంతో ప్రజా విశ్వాసాన్ని వమ్ము చేస్తే.. కచ్చితంగా వారి అహంకారం కూడా విచ్ఛిన్నమవుతుంది’’ అని ఆమె వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కలసి ప్రజల ముందుకు వెళ్లడం తెలిసిందే. ప్రజా తీర్పు బీజేపీ-శివసేనకు అనుకూలంగా ఉంటే.. దీనికి విరుద్ధంగా శివ సేన కాంగ్రెస్, ఎన్సీపీతో జట్టుకట్టడాన్ని కంగన పరోక్షంగా ప్రస్తావించింది.