ఉక్రెయిన్ పై మొండిగా దాడికి రష్యాదేశాధినేత పుతిన్ దిగారన్న ఆరోపణలు చేసేలా ఓ కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్ పై రష్యా దాడికి సిద్ధమైనప్పుడు యుద్ధాన్ని నివారించడానికి పలు దేశాల అధినేతలు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కూడా పుతిన్ కు ఫోన్ చేసి 9 నిమిషాల పాటు చర్చించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో చర్చించాలని సూచించారు. దీనిపై స్పందించిన పుతిన్.. ‘అమెరికా అధ్యక్షుడితో మాట్లాడే కంటే వెళ్లి ఐస్ హాకీ ఆడుకుంటా..’ అని వ్యాఖ్యానించినట్టు తాజాగా వెల్లడైంది. దీనిపై ఓ ఆంగ్ల మీడియా సంస్థ డాక్యుమెంటరీని విడుదల చేసింది.ఉక్రెయిన్ పై రష్యా దాడికి నాలుగు రోజుల ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ తో పుతిన్ ఈ మాట అన్నట్టు తాజాగా బయటికి వచ్చింది. ఉక్రెయిన్ పై యుద్ధానికి రష్యా ఎంత మొండిగా ముందుకెళ్లిందనే విషయాన్ని ఈ వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనివల్లే ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa