స్పైస్‌జెట్‌కు చెందిన విమానాలు వరుస ప్రమాదాలకు గురవుతుండటం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం దిల్లీ నుంచి దుబాయ్వెళ్తున్న విమానాన్ని సాంకేతిక సమస్యలతో అత్యవసరంగా కరాచీలో ల్యాండ్చేశారు. ఈ ఘటన మరవకముందే అదే రోజు మరో విమానాన్ని ముంబైలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. కాండ్ల నుంచి ముంబైకి ప్రయాణిస్తున్న విమాన విండ్‌షీల్డ్ దెబ్బతినడం వల్ల ముంబైలో ల్యాండ్చేశారు. గత 17 రోజుల్లో ఇది ఏడో ఘటన.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa