నిత్యావసర వస్తువులయినటువంటి పప్పు, వంట నూనె ఇతర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం జరిగిందని వీటితోపాటు వంట గ్యాస్, పెట్రోల్ , డీజిల్ ధరలు భారీగా పెరగడం జరుగుతోందని రైతు సంఘం నాయకులు మలిశెట్టి జతిన్ అన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని వెంకటరాజు పల్లిలో ఆయన మాట్లాడుతూ పెరిగిన ధరలతో సామాన్య కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ధరలను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని జతిన్ అన్నారు. మూలిగే నక్కపై తాటికాయ పడిన విధంగా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం చాలా బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా ధరలు కట్టడి చేసే ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులో వంట గ్యాస్ సిలిండర్ ధర 3000 రూపాయల పైనే పోయేటటువంటి ప్రమాదం ఉంది అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు జతిన్ అన్నారు