--- పరగడుపున పచ్చి కూరగాయలను తినకూడదు. ఎందుకంటే, వాటిలోని పీచు పదార్ధం సరిగా జీర్ణమవ్వక కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.
--- ముదురు రంగు ఆహార పదార్ధాల్లో, ముఖ్యంగా నలుపు రంగు ఆహార పదార్ధాల్లో పోషకాలు అధికంగా ఉంటాయని సమాచారం.
--- కీళ్ళనొప్పుల నుండి తక్షణ ఉపశమనం పొందాలంటే, ఈ చిన్న చిట్కాను పాటించండి. ఉల్లిపాయలను మెత్తగా నూరి, ఆ మిశ్రమాన్ని ఆవనూనె లో వేయించి, గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్టు కట్టుకుంటే సరి.
--- శరీరంలోని మలినాలను యూరిన్ ద్వారా బయటకు వెళ్లగొట్టడంలో క్యాలీ ఫ్లవర్ బాగా పనిచేస్తుంది.