జమ్మూకశ్మీర్ స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్‌ను జట్టుకు అవసరమైన రీతిలో మెరుగుపరుచుకోగలిగితే ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యే అన్ని అవకాశాలు ఉంటాయని భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2022)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన ఉమ్రాన్ మాలిక్, దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు భారత జట్టుకు ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడలేకపోయినా.. ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20 సిరీస్‌లలో ఆడాడు. రెండో టీ20లో చివరి ఓవర్‌లో 17 పరుగులు డిఫెండ్ చేసి 4 పరుగుల తేడాతో జట్టుకు విజయాన్ని అందించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌లో మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు అందుకుంటున్న రోహిత్.. ఉమ్రాన్ మాలిక్‌కు జట్టులో నిర్దిష్ట పాత్ర కల్పించేందుకు మేనేజ్‌మెంట్ ప్రయత్నిస్తోందని చెప్పాడు. 'మా ప్రణాళికల్లో అతడు ముఖ్యమైన ఆటగాడు. అతని నుండి జట్టుకు ఏమి అవసరమో తెలియజేయడానికి మేము కూడా ప్రయత్నిస్తున్నాము. కొంత మంది కుర్రాళ్లను జాతీయ జట్టుకు ఆడించాలని ప్రయత్నిస్తున్న మాట వాస్తవమే. వారిలో ఉమ్రాన్ ఖచ్చితంగా ఒకరు అన్నాడు.