ప్రయాణం మొదలు పెట్టే ముందే టైర్లు, బ్రేకులు చెక్ చేసుకోండి
*సాధ్యమైనంత తక్కువ వేగంలో వెళ్లండి
*లైట్లు, ఇండికేటర్, గేర్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి
*లైట్, ఇండికేటర్ దగ్గరి వైర్లు బయటకు వస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది
*వాటర్ లెవల్ బైక్ బాష్గార్డ్ కంటే తక్కువ ఎత్తులో ఉంటేనే ఆ రోడ్డులో వెళ్లాలి
*ముందు వెళ్లే వెహికల్స్‌కి కొంచెం ఎక్కువ గ్యాప్ మెయింటెయిన్ చేయాలి
*వర్షం నీళ్లలో గుంతలు, మ్యాన్ హోల్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు తెలిసిన మార్గంలోనే వెళ్లండి.
*వర్షం కురిసినా లేకున్నా రెయిన్ కోట్ వెంట ఉంచుకోండి
*వర్షం నీరు నిలిచిన చోట స్పీడ్ గా వెళ్తే బురద నీరు ఇతర వాహనాలపై చిమ్మే ప్రమాదం ఉంది. అందువల్ల నిదానంగా వెళ్లడం మంచిది.
*వర్షంలో ముందు వాహనాల మార్గాన్ని గమనిస్తూ వెళ్లడం మంచిది. ముందు వాహనం టైర్లు గుంతలో పడితే మనం కాస్త జాగ్రత్త పడే అవకాశం మనకు ఉంటుంది.