కంభం: పట్టణంలోని అమరావతి - అనంతపురం జాతీయ రహదారిపై సిఐ రాజేష్ కుమార్, ఎస్ఐ నాగమల్లేశ్వరరావు రోడ్డు ప్రమాదాలపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ రాజేష్ కుమార్ వాహనదారులతో మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని విజ్ఞప్తి చేశారు. ఇక మద్యం తాగి వాహనాలు నడపవద్దని.. చిన్న పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని వాహనదారులను హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa