నడిరోడ్డుపై ఓ వ్యక్తిని హత్య హత్య చేసిన సంఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ మహేష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని టంగటూర్ - గొల్లగూడ ప్రధాన రోడ్డులో సోమవారం ఉదయం (TS 17 J 9080) నెంబర్ గల టీవీఎస్ లూనా వాహనంపై సంగారెడ్డి జిల్లా బీరంగూడ నివాసి ఎరుకల శంకరయ్య (50) తన సొంత పని నిమిత్తం టంగుటూరి గ్రామానికి వచ్చాడని, పని ముగించుకుని అదే గ్రామంలో కల్లు తీసుకొని నివాసానికి తిరుగు ప్రయాణం కాగా మార్గమధ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు కట్టెలతో అతి కిరాతకంగా కొట్టి, అతనిపై దారుణంగా హత్య చేశారని, అక్కడికక్కడే రక్తపు మడుగులో శంకరయ్య మృతి చెందాడని సిఐ తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.