సమాజ్ వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలిసిన వెంటనే ఆమె మృతికి సంతాపం ప్రకటించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆ తర్వాత ఆదివారం రాత్రి ములాయం నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ములాయంకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన ఆదిత్యనాథ్ అక్కడే కొద్దిసేపు గడిపారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అఖిలేశ్ పక్కనే కూర్చున్న ఆదిత్యనాథ్.. ములాయం, అఖిలేశ్‌లతో కాసేపు మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa