జగన్ రెడ్డి పాలన, స్వార్థం, కక్షలతో నిండిన ఆయన సైకో మనస్తత్వం అభిమానులకు సైతం వెగటు పుట్టిస్తోంది అని టీడీపీ నాయకులూ వాపోతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా, వలేటివారి పాలెం మండలం, చుండికి చెందిన ముతకని రమేష్ టీడీపీ పార్టీలో చేరిన సందర్భంగా స్థానిక టీడీపీ నేతలు మాట్లాడుతూ... గతంలో జగన్ రెడ్డి పై వీరాభిమానంతో, జగన్ పేరును చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అంతటి అభిమాని కాస్తా గత శనివారం కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం ఇంచార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తన బంధువులు, స్నేహితులతో సహా తెలుగుదేశంలో చేరారు. అని తెలియజేసారు. ప్రజలకి ఇప్పుడిప్పుడే జగన్ అసలు రూపం వ్యక్తమవుతోందని, రాబోయే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తారు అని తెలియజేసారు.