ట్విట్టర్ సంస్థ డెలావేర్ కోర్టులో ఎలాన్ మస్క్ పై వ్యాజ్యం దాఖలు చేసింది. ట్విట్టర్ ని కొనుగోలు చేస్తానని చెప్పి ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గారు. కాగా తాను ట్విట్టర్ ను కొనుగోలు చేయడం లేదని ప్రకటించేశారు. దీంతో మస్క్ కు వ్యతిరేకంగా ట్విట్టర్ యాజమాన్యం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. మస్క్ ప్రకటించినట్టుగానే ఒక్కో ట్విట్టర్ షేరును 54.20 డాలర్లకు కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.