పాట్నాలో మోదీని లక్ష్యంగా చేసుకొని కుట్ర పన్నిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను పాట్నా పోలీసులు అరెస్ట్ చేశారు. 2047 నాటికి భారత్ ను ఇస్లామిక్ దేశంగా చేయాలన్నది ఉగ్రవాదుల లక్ష్యమని, ప్రధాని మోదీ హత్య రెండో లక్ష్యంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇద్దరు ఉగ్రవాదులను అథార్ పర్వేజ్, మహమ్మద్ జలాలుద్దీన్గా గుర్తించారు. జూలై 12న మోదీ బిహార్ పర్యటన సందర్భంగా ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు వెల్లడించారు.