తిరుమలలో గురువారం మంత్రి రోజా చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు చేశారు. బోగస్ సర్వేలు చేయించే చంద్రబాబుని బోగస్ బాబుగా పిలుస్తున్నారని అన్నారు.పది రోజులకి ముందు సీఎం అయినా మహారాష్ట్ర సీఎంకు టాప్ 5ర్యాంకు, 3ఏళ్ళుగా అన్ని పథకాలను అమలు చేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి అట్టడుగు ర్యాంకు ఇవ్వడంపై రోజా మండిపడ్డారు. చంద్రబాబు, నారా లోకేష్‌కి చిన్న మెదడు చిట్లిపోయిందని ఆసుపత్రిలో చేర్పించాలని నిప్పులు చెరిగారు.