దేశంలో తొలి మంకీపాక్స్ కేసు గురువారం కేరళలో నమోదైంది. ఈ నేపథ్యంలో అంటువ్యాధుల నిపుణుడు, HIV-AIDS కన్సల్టెంట్ డా.ఈశ్వర్ గిలాడా మాట్లాడుతూ మంకీపాక్స్ కూడా AIDS మాదిరి లైంగికంగా సంక్రమిస్తుందని అన్నారు. ఇది సోకిన వ్యక్తులపై సమాజంలో ఒక రకమైన వివక్ష కలిగించే అవకాశం ఉన్నందున WHO ఈ విషయాన్ని చెప్పడం లేదన్నారు. ప్రస్తుతం ఈ వ్యాధికి సరైన చికిత్స లేదని, అయితే మశూచి వ్యాక్సిన్ ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.