కరోనా కష్ట కాలంలో పేద ప్రజలను ఆదుకోవాలనే సదుద్దేశ్యంతో ఉచితంగా బియ్యం పంపిణీ ని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గత రెండు సంవత్సరాలు గా చేస్తూ వస్తున్నారని రాష్ట్ర బిజెపి కౌన్సిల్ మెంబర్ పుట్ట రాంబాబు అన్నారు ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వివిధ కారణాలు చూపుతూ గత నాలుగు నెలలుగా కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యం ను లబ్ధి దారులకు అందజేయడం లేదు అన్నారు.
ఈ విషయమై రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సోమవారం ఉదయం పది గంటలకు అన్నీ మండల కేంద్రము లలో గల తహసీల్దారు ఆఫీస్ ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టి వెంటనే కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యం ను లబ్దిదారులకు పంపిణీ చేయాలని వినతి పత్రాలు తహసీల్దారుకు అందజేయాలని నిర్ణయించడం జరిగిందనారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు విరివిగా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన కోరారు.