పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 12 వరకు జరిగే ఈ సమావేశాల్లో కేంద్రం.. కంటోన్మెంట్ బిల్లు, మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ బిల్లుతో సహా 24 బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇక పెరుగుతోన్న ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, అగ్నిపథ్, నిరుద్యోగం, రూపాయి విలువ పతనం వంటి అంశాలతో బీజేపీపై ఒత్తిడి తెచ్చేందుకు విపక్షాలు సన్నద్ధమయ్యాయి.