సీజనల్‌గా లభించే ఆల్‌బుఖరా తింటే ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుందంటున్నారు న్యూట్రిషన్లు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పండు పోషకాల గని. విటమిన్ సి ఎక్కువగా లభించే ఈ పండ్లు ఇమ్యూనిటీ బూస్టర్లలా పనిచేస్తాయి. దానితో పాటు మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలుంటాయి. రోగాలు దరిచేరకుండా ఉంటాయి. ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తి వస్తుంది. మలబద్ధకం ఉన్నవారు ఈ పండ్లు తింటే జీర్ణవ్యవస్థ గాడిలో పడుతుంది.